సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్, యు నారాయణ్ పూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబోజ్ మాడ్ అటవీ ప్రాంతంలోనీ ఉర్చ పాల్, పరౌది, పాంగూర్, టేకమెట, ముస్ పార్సీ, కుకూర్ లోని మావోయిస్ట్ క్యాంప్ ల మీద పోలీసులు మెరుపు దాడి చేసారు. .ఈ దాడిలో మావోయిస్ట్ ల రాకెట్ లాంచర్ ల ఫ్యాక్టరీలను ధ్వంసం చేసారు. భారీ స్థాయిలో రాకెట్ లాంచర్లు, వాటి తయారీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని సమాచారం. .