చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సౌండ్ పార్టీ ఉంటుంది
(సిరా న్యూస్);
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.