ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
సిరా న్యూస్,ఖానాపనూర్;
గ్రామాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడం మండలంలోని గంగాపూర్ గ్రామంలో పర్యటించి, బ్రిడ్జినీ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు గ్రామస్తులు డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్రంలో గడీల ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు. ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉండి ఆదిశగా పనిచేస్తుందని తెలిపారు.ఆరు గ్యారంటీలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తమన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో యువతి, యువకులు ఉన్నత చదువులపై దృష్టి సారించాలన్నారు.వారంలోగా అధికారుల నుండి నివేదికలు తీసుకోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీద వాళ్ళు చట్ట సభలో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఏజెన్సీ తో పాటు హైదరాబాదులో కోచింగ్ సెంటర్ లను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రము అప్పుల కుప్పగా మారిందన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరగా రిలీజ్ అయ్యే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అల్లంపల్లి నుండి ప్రత్యేక వస్తున్న బస్సు నడిపించడం జరుగుతుందన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కారం కృషి చేస్తానని అన్నారు. అనంతరం ప్రజలకు దుప్పట్లు, స్వేటర్ లను పంపిణి చేశారు.