బీంపూర్, సిరా న్యూస్
సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు కునారపు వినోద్ యాదవ్ తో కలిసి మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఏ పని కావాలన్నా చేసి పెడతానని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చేదే ప్రభుత్వం అని పేర్కొన్నారు.