సిరా న్యూస్, బేల:
బేల ఎస్సీ కాలనీలో రాజ్యమేలుతున్న సమస్యలు
+ పట్టించుకోని పాలకులు, అధికారులు
+ కనీసం సీసీ రోడ్లు లేకపోవడంతో ఏళ్లుగా అవస్థలు
+ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్న కాలనీ వాసులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సమస్యలతో కాలనీ వాసులు సతమతమౌతున్నారు. కాలనీలో ఏళ్లుగా కనీసం సీసీ రోడ్లు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బంది ఉన్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. పక్కా ఇండ్లు సైతం లేకపోవడంతో, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాలనీలో ఎక్కడపడితే అక్కడ పిచ్చిమొక్కలు పెరిగి, జనాలు రోగాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు సైతం కాలనీలో సానిటేషన్ పనులు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుదు కృష్ణపెళ్లి అంకుష్, ఇతర నాయకులు యముర్లవార్ గణేష్, విలస్, అశోక్‌లతో కలిసి శనివారం కాలనీలో పర్యటించి, కాలనీవాలసుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. అధికారులు ఎస్సీ కాలనీపై ప్రత్యేక శ్రద్ద వహించి తక్షణమే రోడ్లు, తాగు నీటి వసతి కల్పించాలని డిమాండ్ చేసారు.