సిరా న్యూస్, ఆదిలాబాద్:
ప్రతీ ఇంటిపై శ్రీ రాముని జెండా ఎగురవేయాలి…
– లోక ప్రవీణ్ రెడ్డి
+ భైంసా ఏఎంసీ మాజీ చైర్మెన్ జాదవ్ రాజేష్ బాబుతో భగత్ సింగ్ నగర్‌లో పర్యటన
+ జెండాలు, దీపాలు, పుస్తకాలు పంపిణీ
ఈ నెల 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై రాముని జెండాలను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌లో భైంసా ఏఎంసీ మాజీ చైర్మెన్ జాదవ్ రాజేష్ బాబుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాషాయ జెండాలు, దీపాలు, రామ మందిర చరిత్ర తెలిపే పుస్తకాలను పంపిణీ చేసారు. అనంతరం ఇంటింటికి శ్రీ రాముని స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరు సోమవారం రోజు తమ తమ ఇండ్లలో దీపాలు వెలిగించి, దీపావళి పండుగ జరుపుకోవాలన్నారు. మందు, మాంసానికి దూరంగా ఉండి, భక్తి శ్రద్దలతో రామున్ని కొలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్, గణేష్, శ్యామ్, ప్రకాష్, పప్పు. తదితరులు పాల్గొన్నారు.