తమ్మినేని ఇక పొలిటికల్ రిటైర్మెంట్…..

                                                                         శ్రీకాకుళం,(సిరా న్యూస్);

పీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైందని రాజకీయ పరిశీలకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల అసంతృప్తి, జగన్ సర్కార్ కక్ష పాధింపు పాలనపై పెల్లుబుకుతున్న ఆగ్రహానికి తోడు తెలుగుదేశం, జనసేన కలిసి కదులుతుండటంతో వైసీపీకి ఇప్పుడు ఓటమి తప్ప మరో అప్షన్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వైసీపీకి ఘోర పరాజయం తప్పద పేర్కొన్నాయి. మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారనీ, ఆందోళన చెందుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రకరకాల ఎత్తులు వేసి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే భారీ స్థాయిలో సిట్టింగులను మార్చేయాలని భావిస్తోంది. అది కూడా ఉత్తరాంధ్రలో ఈ అభ్యర్థుల మార్పుపై విషయంలో భారీ కసరత్తే జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోస్తాంధ్రలో పప్పులు ఉండకవన్న భావనకు వచ్చేసిన వైసీపీ.. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఎలాగోలా ఎన్నికల సమయానికి విశాఖ నుండి సీఎం పరిపాలన ప్రారంభించేయాలని నానా హడావుడీడ పడింది. అయితే అది ఆచరణ సాధ్యం అవుతుందా అంటే పరిశీలకుల నుంచే కాకుండా, న్యాయనిపుణుల నుంచి కూడా అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది. విశాఖ పరిపాలనా రాజధాని అన్న హామీతో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ, మరీ ముఖ్యంగా జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగులపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రభావం తగ్గించుకునేందుకు కొత్త అభ్యర్థులను బరిలో ఉంచాలని యోచిస్తున్నదని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలో దించడం, పలువురు ఎమ్మెల్యేలకు స్టీట్ల మార్పు వంటి చర్యలపై జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *