సిరా న్యూస్,బేతంచర్ల;
అయోధ్యలో శ్రీరాముని మందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బేతంచర్ల పట్టణంలోని హిందూ సోదరులు శ్రీరాముని విగ్రహానికి పూజలు నిర్వహించి గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక అయినా రామ మందిరం నిర్మాణం పూర్తి చేసి అందులో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసినందుకు ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలోని పురవీధుల గుండా శ్రీరాముని నామస్మరణతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ సోదరులు పాల్గొన్నారు.