శ్రీరామ నామంతో మారుమోగిన దేవాలయాలు

భక్తిశ్రద్ధలతో శ్రీరామునికి పూజలు నిర్వహించిన భక్తులు
భక్తులకు కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ

సిరా న్యూస్,తుగ్గలి;
అయోధ్య నందు బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం రోజున మండల పరిధిలోని గ్రామాలలోని శ్రీరాముని మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు శ్రీరామ నామ స్మరణతో మారుమోగిపోయాయి.బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మండల కేంద్రమైన తుగ్గలి లో గల శ్రీ సీతారామ దేవాలయం నందు సీతారామ లక్ష్మణ మరియు ఆంజనేయ స్వామి కు పూల హారాలతో అలంకరించి ప్రత్యేక పూజలను పురోహితులు నిర్వహించారు.బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గ్రామ ప్రజలు రామునికి పంచామృత అభిషేకం,అష్టోత్తరం మరియు 108 సార్లు శ్రీరామ నామంతో హోమాలను నిర్వహించారు. అనంతరం పూజాకు విచ్చేసిన భక్తుల కొరకు తుగ్గలి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం సాయంకాలం గ్రామ ప్రజల దర్శనార్థం సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.అదేవిధంగా మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామం నందు శ్రీ విరుపాక్షేశ్వర భజన మండలి గౌరవాధ్యక్షులు ఉమామహేశ్వర మరియు భజన మండలి సభ్యులు,గ్రామ పెద్దలు,ఆలయ ధర్మకర్త మండలి గ్రామ సర్వజనులు విశ్వహిందూ పరిషత్ సభ్యులు గాజుల గిడ్డయ్య అయోధ్య శ్రీ రామచంద్ర మూర్తి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వాల్మీకి రచించిన రామాయణాన్ని పఠించారు.అనంతరం అన్న తీర్థ ప్రసాదములు వితరణ చేశారు.గ్రామ శోభాయాత్ర గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *