సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేటలో దారుణం జరిగింది. దివ్యాంగురాలు అయిన చెల్లిపై అన్న గొడ్డలితో దాడి చేసాడు. ఆస్తి విషయంలో గొడవ పడి తోబుట్టిన చెల్లి పొన్నం సారక్కను హతమార్చే యత్నం అన్న పొన్నం సమ్మయ్య చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సారక్కని పోలీస్ వెహికల్ లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆస్తి తగాదా విషయంలో కొద్ది రోజులుగా అన్న, చెల్లెలు మధ్య గొడవలు జరగుతున్నట్లు సమాచారం. నిందితుడు సమ్మయ్య పోలీసులు అదుపులో వున్నాడు