విశాఖపట్నం,(సిరా న్యూస్);
విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన లారీ.. వెనుక నుంచి స్కూల్ పిల్లల ఆటోను ఢీకొ ట్టింది. ఈ ఘటనలో ఎనిమిది చిన్నా రులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఘటనా స్థలంలో హృదయ విదారకర దృశ్యాలు అంద రినీ కలిచివేస్తున్నాయి. ఈ ఘటన బుధవారం ఉదయం విశాఖలోని సం ఘం – శరత్ థియేటర్ దగ్గర చోటు చేసుకుంది. గాయపడ్డ చిన్నారులు స్కూల్ విద్యార్థులుగా గుర్తిం చారు. చిన్నారులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు.కాగా.. ఆటోను ఢీకొట్టిన అనతరం లారీ డ్రైవర్ పారిపోతుం డగా స్థానికులు పట్టుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ పడిన ప్పటికీ హైస్పీడ్‌లో వచ్చి వెనుక నుంచి లారీ ఆటోను డీకొట్టింది. హెవీ వెహిక ల్స్‌కి నిషేధం ఉన్న సమయంలో లారీ సిటీలోకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనకు సంబం ధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.