పరామర్శించిన యార్లగడ్డ
సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం లో టీడీపీ కి చెందిన కాసరనేని రంగబాబు పై వైసీపీ నాయకులు చేసిన దాడిని గన్నవరం టిడిపి ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. హైదరాబాద్ నుంచి నేరుగా అయన పిన్నమనేని హాస్పిటల్ కి చేరుకున్నారు. నేనున్నా మీకేం కాదు అంటూ ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలుకు నాయకులు కు ఎటువంటి ఇబ్బంది కలిగినా తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుంది. రంగబాబు కి పూర్తి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాడికి సంబంధించిన వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్తి ఆధారాలు ఉన్నా కూడా ఇంత వరకు నిందుతులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నన్ను ఎంత గాయపరచిన నా ప్రాణం పోయే వరకు యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం కష్టపడతా అని అవసరం అయితే వీల్ చైర్ లో కూడా తిరుగుతా అని మాజీ పి ఏ సి ఎస్ బ్యాంకు ప్రెసిడెంట్ కాసరనేని రంగబాబు తెలిపారు.