సిరా న్యూస్,భువనగిరి;
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో పలు హ్యాండ్లూమ్ షాప్ లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి ఇక్కత్ చీరలుగా అమ్ముతున్నారని ఆరోపణ నేపధ్యంలో ఈదాడులు జరిగాయి. పలు షాపుల్లో నకిలీ ఇక్కత్ చీరలను స్వాధీనం చేసుకొని.. వెంటనే షాప్ యజమానులకు నోటీసులు అందించారు.