సిరా న్యూస్,మేడ్చల్;
సూరారం పి.యస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం లో బాయ్స్ హాస్టల్లో ఉంటున్న మృతుడు ప్రసన్న ( 27) గా గుర్తించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దినసరి కూలీ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న ఒరిస్సా వాసి గా గుర్తించారు. రూమ్ లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొన్న సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..