సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జీడబ్ల్యూఎంసి అధికారులు పార్కింగ్ కు అంతరాయం కల్పిస్తున్న షాపింగ్ మాల్స్ పై కొరడా ఝలిపించారువరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్ సైన్ బోర్డ్స్, పార్కింగ్ ప్లేస్ లో వ్యాపార నిర్మాణాలు తొలగించారు. నగరంలో పార్కింగ్ కు అంతరాయం కల్పిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. అయితే ఇవన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలే నని వ్యాపారులు అరోపించారు.