ఏబివిపి పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్
సిరా న్యూస్,పెద్దపల్లి;
మరణం లేని మహావీరుడు, భరత మాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పూర్తిగా దేశంకోసం యువత తెగించి పోరాడాలని అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ పిలుపునిచ్చారు. నేతాజి 127వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఏబివిపి పెద్దపల్లి నగర శాఖ ఆద్వర్యంలో పరాక్రమ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి ఆర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత స్వాత్రంత్ర్య ఉధ్యమంలో బ్రిటీష్ పాలకుల గుండెల్లో సింహం వలే నిద్రించారని తెలిపారు. నాకు రక్తాన్నివ్వండి, మీకు దేశాన్నిస్తాను అంటూ యువతలో స్వతంత్ర్య కాంక్షను రగిలించిన స్పూర్తిప్రధాతగా అభివర్ణించారు. జైహింద్ నినాదంతో నరనరాన దేశభక్తిని నింపి, అజాద్ హింద్ ఫౌజును స్తాపించిన నేతాజీ చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ నగర కార్యదర్శి అజయ్, జోనల్ ఇన్చార్జ్ అరవింద్, నాయకులు సాయి తేజ, శ్రీ దత్త, గణేష్, మధుకర్, బన్నీ, అభిరామ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.