జై హింద్ నినాదాన్ని ఆయుధంగా మలిచిన గొప్ప వ్యక్తి

అజాద్ హింద్ పౌజుతో అఖండ భారతావనికి సైనికుడిగా నిలిచిన వ్యక్తి

 సిరా న్యూస్,కమాన్ పూర్;
జై హింద్ నినాదాన్ని ఆయుధంగా మల్చిన వీర చంద్రుడు సుభాష్ చంద్రబోస్ అని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. సోమవారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడువైనాల రాజు మాట్లాడుతూ దేశ దాస్య సుంకలాలు తెంచాలని దేశ పౌరులందరికీ ఏకతాటిపైకి తెచ్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు యువకులంతా మీ రక్తాన్ని ధారపోయండి నేను మీ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తాను అని రగిలించి జైహింద్ నినాదాన్ని ఒక ఆయుధంగా మలిచిన గొప్ప యోధుడు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు కమాన్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్ గుండారం గ్రామ సర్పంచ్ ఆకుల ఓదెలు జిల్లా కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాడిపల్లి సుమన్ పిడుగు స్వామి గుండా నరసన్న బుర్ర సత్యం బుద్దుల రవీందర్ ఇరుగురాల కుమార్ ధోనికైనా అఖిల్ కామెరనరేష్ రేవెల్లి శివకుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *