తెలంగాణ మాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో గణిత ప్రతిభా పరీక్ష

 సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం లోనీ చిలుకూరు గ్రామంలో శ్రీనివాస రామానుజన్ జన్మదినం ( డిసెంబర్ 22) పురస్కరించుకొని ఈరోజు 23 వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, విద్యార్థినీ, విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష వేరు వేరుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండల విద్యాధికారి ఎండి సలీం అనుమతితో చిలుకూరు ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, బేతవోలు ప్రధానోపాధ్యాయులు తేజు రామ్ పర్యవేక్షణలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరు నందు మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు హాజరైనారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుండి 18 మంది విద్యార్థినీ, విద్యార్థులు ప్రతిభా పరీక్షలో పాల్గొన్నారు. వీరిలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ,నుండి ప్రధమ, ద్వితీయ ,ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలో ఎంపికైన ప్రధమ, ద్వితీయ విద్యార్థినీ, విద్యార్థులు ఈనెల 27వ తారీఖున సూర్యాపేట జిల్లా జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ లో జరిగే జిల్లాస్థాయి పరీక్షకు అర్హులవుతారు అని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలో తెలుగు మీడియంలో ప్రథమ శ్రేణి బి వైష్ణవి రామాపురం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, ద్వితీయ శ్రేణి కె రమ్య ఆచార్యగూడెం జడ్పీహెచ్ఎస్ స్కూల్, ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ శ్రేణి చరణ్ సాయి గౌడ్ జడ్.పి.హెచ్.ఎస్ చిలుకూరు, ద్వితీయ శ్రేణి పి పరిమళ జడ్పీహెచ్ఎస్ స్కూల్ చిలుకూరు ఎంపిక కావడం జరిగింది. ఈ నలుగురు జిల్లా స్థాయి పోటీ పరీక్షకు అర్హత సాధించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాల గణిత ఉపాధ్యాయులు సిహెచ్ రాములు, ఏ రామ్మోహన్, ఏ జనార్ధన్, వై రవికుమార్, కే రామిరెడ్డి, ఎస్ కే జానీ మియా, నాగరాజు స్కూలు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *