సిరా న్యూస్,నెక్కొండ ;
వ్యవసాయ క్షేత్ర సందర్శనలో బాగంగా దీక్ష కుంట, టి. కే. తండా, సూరిపల్లి, చిన్నకోర్పొలు గ్రామాలు, నెక్కొండ మండలం లో జాతీయ ఆహార భద్రత పథకం క్రింద సరఫరా చేసిన వేరుశనగ మినికిట్ ప్రదర్శన క్షేత్రాన్ని సందర్శించిన డి.ఉష, జిల్లా వ్యవసాయ అధికారి, వరంగల్,
.పి. సారంగం, కన్సల్టెంట్ (ఎన్ఎఫ్ఎస్ఏం), ఉమ్మడి వరంగల్ జిల్లా , నాగరాజు, రంజిత్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారులు , రైతులు సందర్శించి రైతులకు పలు సూచనలు చేయడం జరిగింది.
వేరు శనగ :
• వేరు శనగ పంటలో ప్రస్తుతం ఎకరాకు 200 కిలోల జిప్సంను వేసుకుంటే కాయల సైజు బాగా ఉండి నాణ్యమైన గింజలు వస్తాయి.
• వేరుశనగలో ఆకు ముడత పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లి . లేదా ఎసిఫేట్ ౩౦౦ గ్రా. 200 లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని ఎకెరకు చొప్పున పిచికారి చేసుకోవాలి.
• పొగాకు లద్దె పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 40 మి.లి. ఎకరాకు 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి లేదా విషపు ఎరను తయారు చేసుకొని ( వరి తవుడు 5 కిలోలు + బెల్లం అర కిలో + మోనో క్రోటోఫాస్ 500 మి.లీ . )చొప్పున ఎకరాకు కలుపుకొని సాయంత్రం వేళలో పొలంలో చల్లుకోవాలి.
వేరు శనగ లో కలుపు నివారణ :
వేరు శనగ విత్తిన 20-25 రోజులకు ఇమాజితా పైర్ +ఇమజామాక్స్ (ఒడిస్సి ) 100 గ్రా. లు లేదా ఇమాజితా పైర్ 250 మీ. లి + క్విజాల్ ఫాఫ్ ఈథైల్ 350 మీ. లీ. ఎకరాకు చొప్ప్పున పిచికారీ చేసుకోవాలి.
వరిలో కాండం తొలుచు పురుగు నివారణ:
• వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి తీసుకోవడానికి ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
• ఈ లింగాకర్షణ బుట్టలలో25-30 మొగరెక్కల పురుగులు వారానికి గమనించినచో నష్టపరిచే స్థాయిగా పరిగణించాలి.
• 20 నుండి 25 రోజుల దశలో కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరంట్రానిలీ ప్రోల్ 4 జి గుళికలు – 4 కిలోలు లేదా కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ ఫోర్ జి గుళికలు-8 కిలోలు ఎకరాకు సమానంగా ఇసుకలో కలుపుకొని పల్చగా నీరు ఉంచుకొని కలిసే విధంగా పిలక దశలో చల్లుకోవాలి.
• లేదా క్లోరంట్రానిలిప్రోల్ 60 మీ.లీ. లేదా కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ 400 గ్రాములు ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నచొ అరికట్టవచ్చును.
• లేదా టెట్రానిలి ప్రోల్ -80 మీ లీ. ఎకరాకు ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నచొ అరికట్టవచ్చును.
వరి అగ్గి తెగులు నివారణకు :
• ట్రైసైక్లజోల్ 120 గ్రా. లేదా ట్రైసైక్లజోల్ +మ్యాంకోజబ్ ( మెర్జర్) 500 గ్రా. లు ఎకరాకు లేదా టేబుకోనాజోల్ +ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ (నేటివో ) 80 గ్రా. లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
వరిలో కలుపు యాజమాన్యం:
• ఎకరాకు ప్రెటిలాక్లోర్ + సేఫ్నర్ మందును 600-800 మి.లీ. విత్తిన 3-5 రోజులలోపు లేదా పైరాజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80-100 గ్రా. లేదా బ్యూటాక్లోర్ 1-1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 500 మి.లీ. లేదా ప్రెటిలాక్లోర్ + బెన్సల్ఫ్యూరొన్ మిథైల్ (లండాక్స్ పవర్) లేదా ప్రెటిలాక్లోర్+ పైరాజోసల్ఫ్యూరాన్ ( ఎరోస్) 4 కిలోలు ఇసుకలో కలిపి చల్లాలి.
• ఎకరాకు సైహలోఫాఫ్ పి బ్యూటైల్ 300 మి.లీ. (ఊద, ఒడిపిలి) లేదా విత్తివ 15 రోజులకు లేదా బిస్పైరిబాక్ సోడియం 100 మి.లీ. విత్తిన 20 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిస్పైరిబాక్ సోడియం వెడల్పాకు గడ్డి జాతిని కూడా అరికట్టును.
• వెడల్పాకు కలుపు నివారణకు 2,4-డి సోడియం సాల్ట్ 600 గ్రా. విత్తిన 25-30 రోజులకు పిచికారి చేయాలి. పంట దశను, కలుపు రకాన్ని బట్టి కలుపు మందును ఎంచుకోవాలి.
• తుంగ మరియు గడ్డి జాతి కలుపు నివారణకు పెనాక్సులం+ చ్చలాఫ్ బ్యూటీల్ (వివయ/రిపిఒకా) ఎకరాకు 800 మీ.లీ. లీటర్లు చొప్పున పిచికారి చేయాలి.
2) మొక్కజొన్న:-
• మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు మొదటి దశలో వేపనూనె 5 మి.లీ లేదా ఇమామ్యాక్టిన్ బెంజోయేట్(ప్రోక్లేమ్) 0.4 గ్రా.లేదా స్పైనోసాడ్(ట్రేసర్) 0.3మి.లీ లేదా క్లోరాంట్రనిలిప్రోల్ (కోరాజేన్)0.3 మి.లీ. ఒక లీటరు నీటి చొప్పున కలుపుకొని మొగిలోపల,సుడిలో పడే విదముగా పిచికారి చేసి పురుగును అరికట్టాలి.
• విషపు ఎరను తయారు చేసుకొని సుడిలో వేసుకోవాలి. అంటే ఎకరానికి 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం తీసుకొని, బెల్లమును 2-3 లీటర్ల నీటిలో కరిగించి, తరువాత తౌడులో కలిపి మిశ్రమాన్ని 24 గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ (లార్విన్) కలిపి మొక్క సుడిలో వేస్తే సమర్ధవంతముగా కత్తెర పురుగును అరికట్టవచ్చు అన్నారు.