అంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచిన దేశభక్తుడు చంద్రబోస్

గాంధీ భవన్ లోసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో జగిత్యాల మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు

 సిరా న్యూస్,జగిత్యాల;
:సాయుధ పోరాటం తోనే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచి దేశ భక్తిని చాటుకున్న గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని జగిత్యాల జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మిదేవేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ,బతికేపల్లి సర్పంచు తాటిపర్తి శోభారాణి లు అన్నారు.మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలను జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి, శోభారాణి లు మాట్లాడుతూ తను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించారని కొనియాడారు. భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కలిగించి, దేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరిచడాని పేర్కొన్నారు.
సుభాష్ చంద్రబోస్ వంటి దేశభక్తుడి ఆశయాలకోసం యువత ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్ రావు పేట్ సర్పంచ్ , కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి , రాష్ట్ర
మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *