సిరా న్యూస్, ఆదిలాబాద్:
నేటి తరానికి స్పూర్తి… నేతాజీ
– లోక ప్రవీణ్ రెడ్డి
+ పట్టణంలోని నేతాజీ చౌక్‌లో ఘనంగా జయంతి వేడుకలు
+ నివాళులర్పించిన లోక ప్రవీణ్ రెడ్డి
తన పోరాటాలతో బ్రిటీష్ వారికి కంటి మీద కునుకులేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్, నేటి తరానికి స్పూర్తి దాయకమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్‌లో, బోస్ విగ్రహానికి బీజేపీ, ఏబీవీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌కు వ్యతిరేకంగా నేతాజీ చేసిన పోరాటాలు మరువలేనివని అన్నారు. దేశం కోసం తన యావత్ జీవితం ధారపోసిన త్యాగమూర్తి బోస్ అని ఆయన అన్నారు. యువకులు ప్రతీ ఒక్కరు నేతాజీని ఆదర్శంగా తీసుకొని, దేశ సేవకు అంకింతం కావాలని కోరారు.