విజయవాడ,(సిరా న్యూస్);
ఎన్ టి ఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఢీ కొట్టిన సమయం లో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.