సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైల్వే గేట్ వద్ద రాత్రి రోడ్డు దాటుతు చిరుత కనిపించింది. చిరుత కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలుభయాందోళన చెందుతున్నారు. మొక్కజొన్న చేను సమీపంలో సెదతీరిన చిరుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత 10 రోజులుగా మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో చిరుత సంచరిస్తోంది. ఇప్పటికే చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పారెస్ట్ సిబ్బంది హెచ్చరిక బోర్డులు, చిరుత ట్రాకింగ్ కెమెరా లు ఏర్పాటు చేసారు. .