కేటీఆర్…నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… దూషిస్తావా…..

?
నిరుద్యోగ యువకులారా…. బీఆర్ఎస్ ను ఓడించి గుణపాఠం చెప్పండి
గంగుల…మనిద్దరి ఆస్తులను ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా?
మీవి భూకబ్జాల భాగోతం… నాది పోరాటాల చరిత్ర
కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కమార్ వ్యాఖ్యలు

కరీంనగర్,(సిరా న్యూస్);
కేటీఆర్ కు కండ కావరం తలకెక్కింది. నిరుద్యోగులు ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరసన తెలిపితే… తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్ చెత్త నాకొడుకుల్లారా… సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడు.. ఆయనకు అహంకారం ఎక్కువైంది. తెలంగాణ యువకులారా… బీఆర్ఎస్ కు ఓడించి గుణపాఠం చెప్పి యువకుల సత్తా చాటండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
కేసీఆర్…. నీకేమో వంద గదుల ప్రగతి భవన్ కావాలే… నిలువ నీడలేని పేదలకు మాత్రం ఇండ్లు ఎందుకు ఇవ్వలే… నీ కుటుంబంలోని అందరికీ కొలువులిచ్చినవ్… మరి తెలంగాణలోని నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికొక ఉద్యోగమైనా ఎందుకివ్వలే? కనీసం నిరుద్యోగ భ్రుతి ఇస్తానని ఎందుకివ్వలే? ఇదే విషయంపై ప్రశిస్తూ మీకోసం నేను కొట్లాడితే 74 కేసులు పెట్టి జైలుకు పంపారు… బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల భాగోతం… నాది పోరాటాల చరిత్ర.. ఎటువైపు ఉంటారో ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *