-ఆర్టీసీ డ్రైవర్ల కు పెద్దపల్లి ఎంవిఐ శ్రీనివాసరావు సూచన
-మంథని ఆర్టీసీ డిపోలో బస్టాండ్ లో ఘనంగా డ్రైవర్ల దినోత్సవం
సిరా న్యూస్,మంథని;
అతివేగం తో కాకుండా వేగ నియంత్రణ పాటిస్తూ వాహనాన్ని నడపాలని ఆర్టీసీ డ్రైవర్లకు పెద్దపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాసరావు సూచించారు.
బుధవారం డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా మంథని డిపోలో, బస్టాండ్ లో మంథని డిపో మేనేజర్ రాజశేఖరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా పెద్దపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆర్టీసీ డ్రైవర్ల కు శుభాకాంక్షలు తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం డ్రైవర్లకు చాలా కష్టం గా మారిన క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్త గా డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చెరవేస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ల కు, ఆటో డ్రైవర్లకు గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంవిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మూల మలుపుల వద్ద జాగ్రత్త గా డ్రైవింగ్ చేయాలని, ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ముందు వాహనము లను గమనించాలని సలహాలు అందించారు.ఈ కార్యక్రమం లో మంథని డిపో మేనేజర్ రాజశేఖరం, ఏఎంఎఫ్ రామస్వామి, ఆర్ హెచ్ సి వెంకటేశ్వర్లు, ఎస్డిఐ గోపాల్, బస్టాండ్ కంట్రోలర్ కర్కా కొండల్ రెడ్డి తో పాటు బస్ డ్రైవర్లు , ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.