సిరా న్యూస్,పెద్దపల్లి;
స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులపై పెట్టుబడిదారులకు అవగాహన అవసరమని మెటల్ అండ్ ఎనర్జీ సంస్థ సీనియర్ ప్రతినిధి వెంకట కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల బీకాం, ఎంకాం విద్యార్థినులకు మూలధన మార్కెట్లలో మదుపు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు ఆయా సంస్థల పురోగతి, వ్యాపార వాణిజ్యస్థాయి, మార్కెట్లో షేర్ క్యాపిటల్, టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య, తదితర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. అలాగే అగ్రశ్రేణి కార్పోరేట్ సంస్థల పని తీరు, పరిశీలించాలని, స్టాక్ కు కమోడిటీకి వ్యత్యాసాలతో పాటు కమోడిటీలో వర్తకం చేస్తున్నప్పుడు కలిగే ప్రయోజనాలను వాటిలో రిస్క్ నష్టాలను వివరించారు. ఈ సదస్సులో కళాశాల కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ జే. రవీందర్, లెక్చరర్స్ పాల్గొన్నారు.