SP Gous Alam: ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని ఎదగాలి

ఇంద్రవెల్లి, సిరా న్యూస్ 

ప్రభుత్వ పథకాలను వినియోగించుకొవాలి

తల్లిదండ్రులు పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా పాఠశాలలకు పంపించాలి.

 పాటగూడ గ్రామంలో ఉచిత బ్లాంకెట్ల పంపిణీ చేసిన ఎస్పీ గౌస్ ఆలం

పోలీసులు జిల్లా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా కోలం గిరిజనులకు ఉచితంగా బ్లాంకెట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 300 బ్లాంకెట్లను నిరుపేద ఆదివాసి కొలాం గిరిజనులకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం  అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొదటిసారిగా గ్రామానికి వచ్చిన జిల్లా కు వచ్చిన ఎస్పీకి సంప్రదాయ గిరిజన సాంస్కృతిక పద్ధతులలో ఘనంగా స్వాగతం పలికారు. శాలువా పూలమాలతో సన్మానించారు.  జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొలాం గిరిజన విద్యార్థులు విద్యపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే విధంగా విద్యనభ్యసించాలని సూచించారు. తమ వంతు కృషిగా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉచితంగా శిక్షణను, పోలీసుల ద్వారా సలహాలను సూచనలను అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నప్పటినుండే పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా వ్యవహరించి పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. యువత విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ప్రభుత్వ అధికారులుగా ఎదగాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవలంబిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.   కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజలు, గ్రామస్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *