సిరా న్యూస్, పెంబి:
ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి…
అర్హులైన వయోజనులంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పెంబి తహసిల్దార్ లక్ష్మణ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్లుగా తమ పేరును జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కుతో సమాజం కోసం, దేశం కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.