Everyone who is 18 years of age must be registered as a voter : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో ప్రధానమైంది
– అదనపు కలెక్టర్ కుమార్ దీపక్

 సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
ప్రజాస్వామ్యం లో ఓటరుదే కీలకపాత్ర అని, దేశాభివృద్ధికి సుపరి పాలన అందించే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్ దీపక్ అన్నారు.
భారత ఎన్నికల వ్యవస్థాపక దినోత్సవం, 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ ఐడిఓసి ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై అధికారులు సిబ్బందితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.
భారత ఎన్నికల సంఘం రూపొందించిన మై భారత్ హోమ్ పాటను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
అర్హులైన ప్రతిఒక్కరూ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, ప్రతి ఏడాది ఓటరు జాబితా సవరణ ఉంటుందని, 18 ఏళ్లు నిండిన వారు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.
కళాశాలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించి ఓటర్ నమోదును చేయించాలని సూచించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె సీతారామారావు మాట్లాడుతూ….
అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటుకున్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు.
భారత ఎన్నికల కమిషన్‌ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు.
అంతకుముందు నాగర్ కర్నూల్ ఆర్డిఓ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా మైదానం నుండి ప్రభుత్వ జర్నల్ ఆస్పత్రి వరకు ఓటర్ చైతన్య అవగాహనపై విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ నర్సింగ్ రావు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణా, జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ జాకీర్ అలీ, డిటి రఘు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *