సిరా న్యూస్;
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి,జిఏడి ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్,సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామి రెడ్డి,ఇతర అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.