ప్రతి పౌరుడూ దేశసేవకు దేశాభివృద్ధికి పాటుపడాలి
ఎంపీడీవో సుబ్బరాజు, గ్రామ సర్పంచ్ పాల్ దినకర్
సిరా న్యూస్,కౌతాళం;
దేశ పౌరులు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుని దేశ సేవకు దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీడీవో సుబ్బరాజు, గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ ,ఎంఈఓ శోభారాణి, డిప్యూటీ తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీపీ అమరేశప్ప ,వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి ,కోఆప్షన్ నెంబర్ మహబూబ్, జిల్లా ఉన్నత పాఠశాల వడ్డే రాముడు పేర్కొన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26, 1950. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్చ,సమానత్వం,లౌకికతత్వం,న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కుగా పొందారని తెలిపారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మరియూ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో, మరియు ఎంపీపీ ,ఎంఈఓ , సర్పంచ్,
జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రజాస్వామ్యం పౌర హక్కులు మన దేశానికి ఉన్నాయని ఇది జాతి గర్వించదగ్గ విషయమని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ పూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని కోరారు దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర యోధులు ఎంతగా పోరాడారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అందరికీ తెలిసిన విషయమే అన్నారు భారతదేశానికి గణతంత్రం ఒక పండుగ లాంటిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరారు. ఈ వేడుకల్లో సచివాలయ సిబ్బంది, టీచర్లు, వాలంటీర్లు ,పంచాయతీ కార్యదర్శి ,పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.