సిరా న్యూస్,శ్రీశైలం;
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం చరిత్ర,సంస్కృతి,పురావస్తు శాస్త్ర పీఠం శ్రీశైలం ప్రాంగణం లో 75 వ గణతంత్ర దినోత్సవాన్ని పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు గారు పతాకావిష్కరణ చేసి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్.అంబేద్కర్ గారి గొప్పతనాన్ని వివరించారు.అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క సముపార్జన వల్లనే మనకు స్వేచ్ఛ,స్వతంత్రం సిద్దించి మన దేశం వర్ధిల్లుతుందని,అందరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం భారతదేశం యొక్క గొప్పతనమని భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26,1950. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్చ,సమానత్వం,లౌకికతత్వం,న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కుగా పొందారని ఈ సందర్బంగా పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.ఇ, శోభన్ బాబు, డా.డి, విశ్వనాధ శాస్త్రి, జూనియర్ అసిస్టెంట్ సి.రమేష్ బాబు,వర్క్ ఇన్స్పెక్టర్ కె,బాబు, ఎం ఏ, ఎంఫిల్, పి.హెచ్డీ పరిశోధక విద్యార్థినీ విద్యార్థులు నాలుగవ తరగతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.