ఘనంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

 సిరా న్యూస్,తిరుపతి;
తిరుచానూరులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కామాక్షమ్మ సమేత పరాసరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలను తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వైసిపి పార్టీ కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. తర్వాత భారీ కేకును కట్ చేసి బాణాసంచా పెద్ద ఎత్తున పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్ర రెడ్డి శ్రీధర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేసిన కే రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రామచంద్రారెడ్డికి ఎల్లవేళలా రుణ పడి ఉంటా నని అన్నారు. వైసిపి కార్యకర్తలు తన అభిమానుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని సంతోషం వ్యక్తపరిచారు

ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎంపిటిసి నరేష్ రెడ్డి వార్డు మెంబర్లు మునీంద్ర రాయల్ ఆర్ ఆర్ యూత్ వాసు సి ఎస్ ఆర్ యూత్ సూరి చింతాలహరి చింతల లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *