– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సిరా న్యూస్,ములుగు;
75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తంగేడి మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు.అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగాజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసంగిస్తు 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.నేడు దేశమంతటా ఆనందోత్సవాలతో గణతంత్రదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను.
దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన అనంతరం 1950లో భారత దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనల్ని మనం పరిపాలించు కోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించిన నాటి దార్శినికులు, రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం.
ప్రజా సేవకులుగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ప్రయాణం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను. మన సేవాకాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశ భక్తుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభతరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియచేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.