డిజిపి కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

సిరా న్యూస్;

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు .రైల్వేస్ & రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ పోలీస్ సిబ్బంది గౌరవ వందన స్వీకరించారు.జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు . డిఐజి కోఆర్డినేషన్ డాక్టర్ గజరావు భూపాల్, డీజీపీ కార్యాలయంలోని వివిధ విభాగాల ఉద్యోగులు ,ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో:
ఇంటెలిజెంట్ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఇంటెలిజెన్స్ చీఫ్, అడిషనల్ డీజీపీ బి శివధర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. డీఐజీ కార్తికేయ ఎస్పీలు భాస్కరన్, శ్రీధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్:
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఎండి , ఐజిపి ఎం.రమేష్ జెండా ఎగరవేసి వందన సమర్పణ చేశారు .ఈ సందర్భంగా ఎం. డి మాట్లాడుతూ… పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు మెరుగుగా పనిచేసి సంస్థకు మంచి పేరు తేవాలని అన్నారు. త్వరలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని , సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *