పెంబి, సిరా న్యూస్
పురుగుల మందు తాగి రైతు మృతి
పురుగుల మందు తాగి ఓ రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం లో చోటుచేసుకుంది. తాటిగూడ గ్రామానికి చెందిన గుగ్లావత్ గోవింద్ (42) అప్పులు ఎక్కువయ్యాయి. పెంబి ఎస్ఐ రజనీకాంత్ వివరాల ప్రకారం తాటిగూడ గ్రామానికి చెందిన గుగ్లావత్ గోవింద్ తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో 3 ఎకరాలు నీలగిరి,5 ఎకరాలు పత్తి పంట వేశాడు. వర్షాలు అధికంగా కురవడంతో పత్తి పంట నీటిలో మునిగిపోయి పంట సరిగ్గా పండక అప్పులు పెరిగాయి. చెట్లు చనిపోవడం తో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఇబ్బందులు పడ్డాడు. ఈ నెల 24 నాడు ఉదయం మృతుడు తన పత్తి చేనులో ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. అయన నిర్మల్ లోని ప్రైవేట్ ఆస్పత్రకి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినా 26 న చనిపోయాడని ఎస్ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు..