ఇంద్రవెల్లి, సిరా న్యూస్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో నాగోబా జాతర స్థలాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎస్పీ గౌస్ అలం పరిశీలించారు. కేస్లాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9 నుంచి ఆదివాసీ మేస్రం వంశీయుల జాతర నాగోబాను ప్రారంభించనున్నారు. జాతర మహాపూజ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని ఆలయ కమిటీ చైర్మన్ మేస్రం శేఖర్ బాబు తెలిపారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ అలం స్థలాన్ని పరిశిలించారు ప్రత్యేక ఏర్పాట్లు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు..