ఆదిలాబాద్, సిరా న్యూస్
ఉత్తమ ఆరోగ్య కార్యకర్తలను సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న పిప్పలదరి సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త ముయ్యాల మోతి, అంకొలి స్టాఫ్ డాక్టర్ సర్ఫరాజ్, బి. సుభాష్, యశోద, వసంత, లక్ష్మి, శ్యామలను తోటి ఏఎన్ఎంలు శాలువాలతో సన్మానించారు. డాక్టర్ సర్ఫరాజ్, సుభాష్ లకు మెమొంటోలు అందజేశారు. మావల సబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం నజియా భాను ను కూడా సన్మానించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు గంగామణి, ద్రుపద, ఆరోగ్య సహాయకులు ఈశ్వర్ రెడ్డి, నారాయణ, ప్రేమ్ సింగ్, మమత, లలిత, శ్రీదేవి, ఇందు బాయి, ఈశ్వరి దేవి, శ్రీనివాస్, ఆలం తదితరులు పాల్గొన్నారు.