తుగ్గలి,(సిరా న్యూస్);
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం రెడ్డి తెలియజేశారు.బుధవారం రోజున మండల పరిధిలోని రాంపల్లి గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల పాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు చెందుతుందని ఆయన తెలియజేశారు.గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాంపల్లి గ్రామ పంచాయతీ కు 23 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిధులు మంజూరు చేసిందని ఆయన తెలియజేశారు.పార్టీలకతీతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థ నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజలందరూ మరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై మండల వైసీపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి తోనే అవుతుందని వారు సభాముఖంగా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు నాయకులు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచంద్రా రెడ్డి,రాతన మోహన్ రెడ్డి,తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి,వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ టిఎండి హుస్సేన్,మండల సచివాలయాల కన్వీనర్ హనుమంతు,కో-ఆప్షన్ మెంబర్ చాంద్ బాషా,గ్రామ సర్పంచ్ మనీంద్ర,ఈఓఆర్డి తిరుపాల్,పంచాయితీ కార్యదర్శి రాజు నాయక్, సచివాలయ సిబ్బంది,మండల వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు,గృహసారథులు,గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.