రోడ్డుపై బైఠాయింపు
సిరా న్యూస్,కొల్లం;
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కొల్లాం జిల్లాలో ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఎస్ఎఫ్ఎ నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. దీంతో కారు దిగిపోయిన గవర్నర్, రోడ్డు పక్కన టీ షాపు వద్ద బైఠాయించారు. వారిని ఎందుకు అడ్డుకోలేదంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే చట్టాన్ని మీరితే కాపాడేది ఎవరంటూ ప్రశ్నించారు. కాగా.. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.