బయ్యారం జీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

సిరా న్యూస్,మధిర;
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర మండలం బయ్యారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు. అయనకు గ్రామ సర్పంచ్ గొర్రె ముచ్చు ప్రకాశమ్మ, ఎంపీటీసీ జయరాజు, ఉప సర్పంచ్ కమతం రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బయ్యారం గ్రామం రావడానికి సరిగ్గా రోడ్డు ఉండేది కాదు. మండలంలో ఈ గ్రామం మూలకు విసిరి పడేసినట్టుగా ఉండేదని అన్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ గ్రామానికి వచ్చిన నేను ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను. ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే వస్తానని చెప్పి రోడ్డు వేయించిన తర్వాతే వచ్చాను. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. బయ్యారం మడుపల్లి మధ్యన ఉన్న చెరువు కట్ట వెడల్పు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. రాష్ట్రంలో పది కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బయ్యారంలో చదువుకున్న యువతీ యువకులు ఎక్కువ మంది ఉన్నారు వీరి కోసం కూడా ఆలోచన చేస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *