సిరా న్యూస్,హైదరాబాద్ ;
హైదరాబాద్ ఎల్బీ నగర్ నివాసి చెన్నోజు సాయి కిరణ్(35) వడ్రంగి పని చేసే వారు. చేతి వృత్తిని వదిలి గత కొద్ది సంవత్సరాలుగా స్థిరమైన ఆదాయం కొరకు ఉబర్ డ్రైవర్ గా నెల జీతానికి పని చేస్తున్నారు. గత నెలలో బంధువుల అంత్యక్రియల కార్యక్రమంలో తడి నేలపై జారటం వలన మడమ ఎముక విరిగింది. రేషన్ కార్డు లేని కారణంగా ఆరోగ్యశ్రీ లో చికిత్సకు అర్హత లేక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారుగా రుా. 60,000/-ల ఖర్చుతో సర్జరీ చేయించు కున్నారు. సాయికిరణ్ కనీసం మూడు నెలల పాటు కదల కూడదని వైద్యుల సలహా. తదుపరి వైద్యానికి మరియు మందులకు గాను ఆర్థిక సహాయం చేయమని వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో సాయికిరణ్ కురూ.40,000/-లుఅందజేసింది.ఈ సందర్భంగా వెస్సో అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూఉపాధి కోల్పోయి, భార్య, ఇద్దరి చిన్నారులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సాయి కిరణ్ చికిత్సకు ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్న దాతలకు ధన్యవాదములు తెలిపారు.