ఐటీడీఏ ఉట్నూరు పరిధిలోని బెల్లంపల్లి ఉద్యాన నర్సరీలో ( రోజ్ గార్డెన్) లో సాగు చేస్తున్న చామంతి బంతిపూల తోటలను వేలం వేస్తున్నట్టు ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిని కుష్బూ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. వేలం ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 11 గంటలకు బెల్లంపల్లిలోని ఐటిడిఏ ఉద్యానవనంలో జరగనుందని పేర్కొన్నారు. ఒక ఎకరంలో సాగు చేసిన చామంతి, బంతిపూలు ఒక సీజన్ కు వేలం వేస్తున్నట్టు పేర్కొన్నారు. అర్హత, ఆసకతి కలిగిన వ్యాపారస్తులు, పూల కొట్టు దుకాణదారులు, రైతులు, ఈ వేలంలో పాల్గొనాలని కోరారు. వివరాలకు ఐటీడీఏ ఉట్నూరు ప్రాజెక్టు ఉద్యాన అధికారి కార్యాలయంలో లేదా హెచ్ ఓ ను 9032313933 సంప్రదించాలని కోరారు.