2బీసీ,మైనారిటీ, ట్రైబల్ సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష

సిరా న్యూస్,హైదరాబాద్;
బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు హజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయండి. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దాం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించండి. అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించండి. ఆ తరువాత సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించండి. కళ్యాణమస్తు పథకం ద్వారా నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించండి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై పూర్తి అధ్యయనం చేయండని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *