చిగురుమామిడి, సిరా న్యూస్
ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఆశ కార్యకర్తలతో మంత్రి మాట్లాడారు. మా పనికి సమాన వేతనం అందేలా చూడాలని కోరారు. చాలా రోజులుగా సరైన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మీ సమస్యను ముఖ్యమంత్రికి వివరించి మీ డిమాండ్లు పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని మంత్రి హామీ ఇచ్చాురు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, మండల అధ్యక్షురాలు పద్మ, సహిదా తార, లక్ష్మి, కమల, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.