విద్యార్ది సంఘాల అందోళన
సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో మంగళవారం విద్యార్ది సంఘాలు అందోళనకు దిగాయి. పాఠశాలలో తమ కూతురి సంరక్షణ కరువవ్వడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంక్రాంతి పండుగ సమయంలో కూడా తనకు ఇబ్బంది ఉందని తను కూతురు చెప్పినట్టు తల్లి వెల్లడించారు. అక్షిత ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదువు రాకపోవడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో మృతురాలు పేర్కోన్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి అక్షిత సొంత గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.