వ్యవసాయ పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న గిరిజనులు
వారం రోజులైనా పట్టించుకోని అధికారులు
వీటీడీఏ ప్రెసిడెంట్ సలేశ్వరం
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూలు జిల్లా పద్మనాపల్లి గిరిజన చెంచు కాలనీలో నీటి ఎద్దడి. ఏర్పడి వారం రోజులు గడిచిన ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని
వీటీడీఏ ప్రెసిడెంట్ సలేశ్వరం అవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండలం లో విలేకర్ల తో వారు మాట్లాడుతూ కాలనీ లో చేతి పంపు. బోర్ కాలి పోయి వారం రోజులు ఆవుతున్న
అధికారులూ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతి రోజు వ్యవసాయ పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటు కాలం వెళ్ళ దిస్తున్నమని తెలిపారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు చోరువ తిస్కొని నీటి ఏదది నివారించి నీటిని అందించేందుకు బోర్ మోటార్ బాగు చేయాలనీ కోరారు. కాకుంటే ల మన్న నూర్ ఐటీడీఏ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.