– హాజరైన మండల జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచ్లు
సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరవాడ మండల అభివృద్ధి అధికారి హేమసుందరరావు సాధారణ బదిలీలు లో భాగంగా ఈస్ట్ గోదావరి బదిలీ అయిన సందర్భంగా పరవాడ మండల పంచాయతీ కార్యదర్శిలు ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు పాల్గొని శాలువా తో సత్కరించారు. అదే విదంగా ఇటీవల కాలంలో పరవాడ ఈఓఆర్డి గా పనిచేసి, ప్రమోషన్ తో వెస్ట్ గోదావరి కి ఎంపీడీఓ గా బదిలీ అయిన పద్మజ కి కూడా శాలువా తో వారి చేతుల మీదుగా సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ మండల వైస్ ఎంపీపీ బూస అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు, పరవాడ మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.