సిరా న్యూస్,మంథని;
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు, మంథని వాసవి క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఓల్లాల వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ కార్యదర్శి ఇల్లెందుల కిషోర్ కుమార్ లు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి మంథని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గం అనుసరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో ఉద్యమకారులు అహింసా మార్గంలో పోరాటం చేసి విజయం సాధించారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో దేశాన్ని ఏకం చేసిన గొప్ప నేత గాంధీజీ అని అన్నారు. నేటి తరం గాంధీజీ ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కొమురవెల్లి మహారాజా శ్రీనివాస్, నాయకులు దొంతుల ఓం ప్రకాష్, కొమురవెల్లి విజయ భాస్కర్, కోలేటి రాజబాబు, కుక్కడపు రామయ్య, కొంతం మారుతి, శ్రీధర్, మహిళా సంఘం నాయకురాలు రేపాల ఉమాదేవి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.