ఫార్మా ల్యాబ్ ఎక్స్పో ను స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలి

 సిరా న్యూస్,పరవాడ;
జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫార్మా ల్యాబ్స్ ఎక్స్పోను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని సియాంక్ ఫార్మా డైరెక్టర్ జెట్టి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకరల పత్రిక సమావేశంలో ఎగ్జిబిషన్ ఉపయోగాలుని తెలియపరిచారు.
ఫిబ్రవరి 1 తేదీ నుండి 3 తేదీ 2024 వరకు జె ఎన్ ఫార్మసిటీలో జరగనున్న ఫార్మా ల్యాబ్ కెమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్కు సంబంధించి ఐదు ఇంటర్నేషనల్ కంపెనీలు 125 ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఫార్మా వలన యువతకు ఎటువంటి ఉద్యోగ ఉపయోగాలు ఉన్నాయని తెలియపరుస్తారని ఈ అవకాశాన్ని స్థానిక నిర్వాసితులు నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ జరగడానికి ముఖ్య ప్రముఖులు ఎం.శివరాం ప్రసాద్ డైరెక్టర్ ఆపరేషన్ వెర్దంట్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అజిత్ కుమార్ శుక్ల అని అన్నారు. ఫిబ్రవరి 1 తేదీ నుండి 3 వరకు ఎగ్జివిషన్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుందని సంబంధిత డైరెక్టర్లు ఈ అవకాశాన్ని అందరూ సద్విని చేసుకోవాలని యువత అందరూ ఉద్యోగులుగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *